పార్లమెంటు సభ్యుడు డీఎస్ కుమారుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు!

  • సొంత కళాశాల ‘శాంకరి’ విద్యార్థినుల ఆరోపణలు
  • ‘నర్సింగ్’ చదువుతున్న విద్యార్థినులు 
  • హోం మంత్రిని కలిసిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు
టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ పై నిజామాబాద్ లోని ఆయన సొంత కళాశాల విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సంజయ్ నిర్వహించే సొంత కళాశాల ‘శాంకరి’లో విద్యనభ్యసిస్తున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు పదకొండు మంది సంజయ్ పై ఈ ఆరోపణలు చేశారు.

హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ రోజు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన నాయిని నర్సింహారెడ్డి.. డీజీపీ, కమిషనర్ లను రేపు వెళ్లి కలవాలని వారికి సూచించారు. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని స్పష్టం చేశారు. కాగా, సంజయ్ ను తక్షణం అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. 
Go Back to Shorts
ds
sanjay
shankari college

More Telugu News